Surprise Me!

Maddila Gurumoorthy Comments: డ్రగ్స్ తో దొరికిన కానిస్టేబుల్ నా గన్ మెన్ కాదు| Asianet News Telugu

2025-06-03 308 Dailymotion

డ్రగ్స్ దందాలో దొరికిన కానిస్టేబుల్ ను తన గన్ మెన్ అంటూ ప్రచారం చేయడం తగదని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి అన్నారు. టీడీపీకి, ఆ పార్టీ సోషల్ మీడియాకు ఎదుటివారిపై నిందలు వేయడం, బురద చల్లడం అలవాటుగా మారిందన్నారు. నిజానిజాలు తెలుసుకుని మాట్లాడాలని, పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో ఏఆర్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న గుణశేఖర్‌ తన దగ్గర నుంచి ఎప్పుడో రిలివ్‌ అయి వెళ్లిపోయారని స్పష్టంచేశారు. వంద రోజుల్లో గంజాయి, డ్రగ్స్‌ అరికడతామని చెప్పి ఇప్పుడు పోలీస్‌ వ్యవస్థలోని వారే ఈ పనులు చేయడం ఏంటని ప్రశ్నించారు. దీనిపై లోతుగా విచారణ జరపాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, ప్రధాని మోదీకి, అన్ని కేంద్ర దర్యాప్తు సంస్ధలకు లేఖ రాస్తానన్నారు.

#gunmann #ysrcpnews #maddilagurumoorthy #appolitics #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️